
హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఖైరతాబాద్, అమీర్ పేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, చిలకలగూడ, మియాపూర్, రాజేంద్రనగర్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాన కారణంగా రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కాలనీలు నీట మునిగాయి.
వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్పేట్, మలక్ పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎల్బీనగర్ వద్ద ఓ కారు గుంతలో ఇరుక్కుపోయింది. డీఆర్ఎఫ్ సిబ్బంది దాన్ని బయటకు తీశారు.
నగరంలో పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు
సీతాఫల్ మండి – 7.2 సెంటీమీటర్లు
బన్సిలాల్ పేట్ – 6.7 సెంటీమీటర్లు
వెస్ట్ మారేడ్పల్లి – 6.1 సెంటీమీటర్లు
అల్వాల్ – 5.9 సెంటీమీటర్లు
ఎల్బీ నగర్ – 5.8 సెంటీమీటర్లు
గోషామహల్ – 5.4 సెంటీమీటర్లు
బాలానగర్ – 5.4 సెంటీమీటర్లు
ఏఎస్ రావు నగర్ – 5.1 సెంటీమీటర్లు
పాటిగడ్డ – 4.9 సెంటీ మీటర్లు
మల్కాజ్గిరి – 4.7 సెంటీమీటర్లు
సరూర్ నగర్ – 4.6 సెంటీమీటర్లు
ఫలక్నుమా – 4.6 సెంటీమీటర్లు
గన్ ఫౌండ్రీ – 4.4 సెంటీమీటర్లు
కాచిగూడ – 4.3 సెంటీమీటర్లు
చార్మినార్ – 4.2 సెంటీమీటర్లు
గుడిమల్కాపూర్ – 4.1సెంటీమీటర్లు
నాచారం – 4.1 సెంటీమీటర్లు
అంబర్పేట్ – 4 సెంటీమీటర్లు
అమీర్పేట్ – 3.7 సెంటీమీటర్లు
సంతోష్ నగర్ – 3.7 సెంటీమీటర్లు
ఖైరతాబాద్ – 3.6 సెంటీమీటర్లు
బేగంబజార్ – 3.5 సెంటీమీటర్లు
హయత్ నగర్ – 3.5 సెంటీమీటర్లు
చిలకానగర్ – 3.5 సెంటీమీటర్లు