Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..విక్రోలీలో విరిగిపడ్డ కొండచరియలు

Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..విక్రోలీలో విరిగిపడ్డ కొండచరియలు

భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం( ఆగస్టు16) వరదలు ముంబైని అతలాకుతలం చేశాయి. వీధులు, రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు నిల్చిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. విక్రోలీ పార్క్ సైట్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చనిపోయారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.  

మరోవైపు భారీ వర్షాలతో లాతోర్ జిల్లా వణికిపోతోంది. జిల్లాలో టెర్నా, మంజారా నదుల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరద ముంపు ఉన్నందున నది పరివాహక ప్రాంతంలో ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.లాతూర్ జిల్లాలో శనివారం (ఆగస్టు 16) సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ జారీ చేసింది. 

ఆగస్టు 16, 2025న తెల్లవారుజామున 1 గంటల నుంచి4 గంటల మధ్య ముంబైలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.పశ్చిమ ,తూర్పు శివారు ప్రాంతాలు అత్యధికంగా దెబ్బతిన్నాయి. పశ్చిమాన మరోల్ ఫైర్ స్టేషన్ లో 207 మిమీ,నారియల్వాడి స్కూల్, శాంటాక్రూజ్ 202 మిమీ వర్షపాతం నమోదు అయింది. తూర్పున ఠాగూర్ నగర్ స్కూల్, విఖ్రోలి 196 మిమీ , బిపి ఆఫీస్, విఖ్రోలి195 మిమీ లవర్షం కురిసింది.

►ALSO READ | స్వాతంత్ర దినోత్సవం రోజే విషాదం: రిటైర్డ్ ఆర్మీ అధికారిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి

ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో భారీ వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  జన్ కళ్యాణ్ సొసైటీలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విఖ్రోలి పార్క్‌సైట్‌లోని వర్ష నగర్‌లో తెల్లవారుజామున 2.39 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 

మరోవైపు ముంబై నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వరద నీరు నిలిచిపోవడంతో భారత వాతావరణ శాఖ (IMD) ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది.ముంబై, రాయ్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రత్నగిరి, పాల్ఘర్, థానేలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లాతూర్‌లోని రెండు నదుల నీటి మట్టం పెరగడంతో నివాసితులకు హెచ్చరిక జారీ చేసింది.