
జైపూర్: భారత స్వాతంత్ర దినోత్సవం రోజే దేశంలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇళ్లు, కుటుంబాన్ని వదిలి సంవత్సరాల పాటు దేశం కోసం సేవ చేసిన ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇండిపెండెన్స్ రోజునే విషాదకర రీతిలో చనిపోయారు. ఓ కారు రిటైర్డ్ ఆర్మీ అధికారిని ఢీకొట్టి దాదాపు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సదరు మాజీ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హిట్ అండ్ రన్ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది.
వివరాల ప్రకారం.. భారత ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ నర్సారామ్ జాజ్రా 2025, ఆగస్టు 15వ తేదీ ఉదయం తన సైకిల్‌పై జైపూర్‌లోని చిత్రకూట్ స్టేడియానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు జాజ్రాను ఢీకొట్టింది. దీంతో ఆయన కారు లెఫ్ట్ టైర్ కింద పడిపోయారు. అయినప్పటికీ డ్రైవర్ కారు ఆపకుండా అలాగే దాదాపు 10 మీటర్లు జాజ్రాను ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాజ్రా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
Also read:-శ్రావణమాసం చివరి ఆదివారం ( ఆగస్టు 17) .. జాతక దోషాలు తొలగుతాయి..
ఈ భయానక హిట్ అండ్ రన్ ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా డ్రైవర్‌ను గుర్తించారు పోలీసులు. కారును నడిపింది మహిళగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మహిళాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నిర్లక్ష్యంగా నడిపి రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరణానికి కారణమైన మహిళాపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.