
శ్రావణమాసం (2025) చివరికొచ్చింది. రేపు ( ఆగస్టు 17) చివరి ఆదివారం.. చాలా పవిత్రమైన రోజని పండితులు చెబుతున్నారు. ఆ రోజున సూర్యుడిని.. నవ గ్రహాలను పూజించడం వలన జాతక రీత్యా దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు సూర్య భగవానుడికి నీటితో తర్పణాలు ఇస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. సూర్య భగవానుడికి పూజించడం వలన ఆరోగ్యంతో పాటు సంపద లభిస్తుందని అంటున్నారు.
శ్రావణమాసం చివరి ఆదివారం పూజ విధానం:
సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి.సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాల కృత్యాలు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆదిత్య హృదయం పఠించి.. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. పండ్లు.. తీపి పదార్దాలు నైవేద్యం సమర్పించాలి. పేదలకు అన్నదానం చేయాలి. బ్రాహ్మణులకు వస్త్రదానంతోపాటు దక్షిణ .. తాంబూలం ఇచ్చి సత్కరించాలి.
పూజలో గుర్తుంచుకోవలసిన విషయాలు:
- పూజ చేసేటప్పుడు పరిశుభ్రత పాటించాలి.
- శాకాహారం మాత్రమే తీసుకోవాలి.
- ఆదిత్య హృదయాన్ని తప్పక పఠించాలి.
- దుష్ట ఆలోచనలు, చెడు మాటలకు దూరంగా ఉండాలి.
- సాయంసమయంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొనాలి.
- ఈ విధంగా శ్రావణమాసం చివరి ఆదివారం పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి..
శ్రీరాముని కథే సాక్ష్యం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి ముందుగా ముమ్మారు ఆదిత్య హృదయాన్ని పఠించి, దైవ అనుగ్రహంతో విజయం సాధించినట్టు వాల్మీకి రామాయణం చెబుతోంది. ఈ శ్లోకాన్ని ప్రతీ ఆదివారం పఠిస్తే గ్రహబాధలు, శని దోషాలు, యమ భయాలు తొలగిపోతాయని నమ్మకం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఆదివారం రోజున ఈ నియమాలు పాటిస్తే ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్య పరిరక్షణ, పుణ్య ఫలితాలు లభిస్తాయి. కనుక సెలవు రోజు మద్యం, మాంసం ఎంజాయ్‌కి కాదు ... సూర్యారాధనకు అంకితం చేయాల్సిన పుణ్యదినంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
Also read:-క్రియాయోగం గురించి భగవద్గీత ఏం చెబుతోంది..
శ్రావణ ఆదివారం ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుందని పండితులు చెబుతున్నారు. రుణబాధలు .. ఇతర ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ధన సంపాదన పెరగడంతో పాటు ఏ పని చేసినా కలసి వస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. సో ఎవరైన సండే స్పెషల్ ఏంటి అని అడిగితే... సూర్యభగవానుడి ఆరాధన అని చెప్పండి.
చేయకూడని పనులు
- మద్యం సేవించకూడదు
- మాంసాహారాన్ని తీసుకోరాదు
- జుట్టు కత్తిరించడం, గోర్లు తొలగించడం వంటివి నివారించాలి
- భార్యతో శృంగార సంబంధానికి దూరంగా ఉండాలి
- సాత్విక ఆహారంతో, ధ్యానం, ప్రార్థనలు చేయాలి.
- ఎవరిని అవమాన పరచకూడదు. . అబద్దాలు ఆడకూడదు.