నిన్న కొంకణ్ తీరం నుండి మహారాష్ట్ర తెలంగాణ దక్షిణ ఛత్తీస గఢ్, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ మీదగా తీవ్ర అల్పపీడన ప్రాంతం వరకు ఉన్న ద్రోని ఈరోజు బలహీన పడింది. నిన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గర లోని పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదిలి ఈ రోజు ఉదయం 5:30 కి వాయుగుండం గా బలపడింది. ప్రస్తుతం ఈ వాయుగుండం దక్షిణ ఒరిస్సా & పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిస్సా, దక్షిణ చత్తీస్ గడ్ మీదుగా వెళుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
ఈ రోజు సగటు సముద్ర మట్టం వద్ద ద్రోణి నలియా, అహ్మదాబాద్,బ్రహ్మపురి, జగ్ధల్ పూర్ , దక్షిణ ఒడిస్సా ప్రాంతంలోని వాయుగుండం మధ్య ప్రాంతం మీదుగా , తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళుతుంది. ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో తెలంగాణ రాష్ట్రంపై వీచే అవకాశం ఉందని పేర్కొంది.
