ఆకాశన్నంటుతున్న నిమ్మకాయల ధరలు

ఆకాశన్నంటుతున్న నిమ్మకాయల ధరలు

సిటీలో నిమ్మకాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎండలు మండుతుండడంతో వినియోగం పెరిగింది. డిమాండ్​కు సరిపడా సరఫరా సప్లయ్ లేక ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం పెద్ద సైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజ్ నిమ్మకాయ రూ.6 పలుకుతోంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల్లో నిమ్మకాయల దిగుమతులు తగ్గడంతో ఉన్న సరుకుకు డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. 
– వెలుగు, హైదరాబాద్