హైదరాబాద్ లో దసరా సందడి... జూబ్లీ హిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు...

హైదరాబాద్ లో దసరా సందడి... జూబ్లీ హిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు...

దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. పల్లెల నుంచి పట్టణాల దాకా ప్రతి ఒక్కరూ విజయ దశమి సంబురాల్లో పాల్గొంటున్నారు. గురువారం ( అక్టోబర్ 2 ) దసరా సందర్భంగా అమ్మవారి ఆలయాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఆలయంలో దసరా సందడి నెలకొంది. 

అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం  నుంచి ఆలయానికి పోటెత్తారు భక్తులు. మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉదయం నుంచి పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి  ప్రత్యేక పూజలు, కుంకుమర్చాన నిర్వహించారు.ఈ క్రమంలో ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబుచేశారు నిర్వాహకులు. ఇవాళపెద్దమ్మ తల్లి రూపంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు.