జనగామలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల క్యూ

జనగామలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల క్యూ

జనగామ వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తరలి వస్తోంది. మూడు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. దీంతో తెల్లవారుజాము నుంచే మార్కెట్ కు రైతులు క్యూకట్టారు .  మార్కెట్ యార్డ్ మొత్తం ధాన్యాన్ని కుప్పలుగా పోస్తున్నారు. 

మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పోసిన రైతులు కొనుగోలు టోకెన్ల కోసం బారులు తీరారు. మార్కెట్ కు సెలవులు ఉండటంతో మూడు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు చెబుతున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా దొరకలేదని.. బయట నుంచి వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నామని వాపోయారు.