తిరుపతికి వెళ్లి వచ్చేసరికి ఇల్లంతా దోపిడి చేశారు.

తిరుపతికి వెళ్లి వచ్చేసరికి ఇల్లంతా దోపిడి చేశారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది.  తిరుపతి వెళ్లిన ఓ ఇంటిని టార్గెట్ చేసుకొని దొంగలు రెచ్చిపోయారు. గాంధీచౌక్ లోని డాబాల బజార్ కు చెందిన  చిట్ ఫండ్ వ్యాపారి పాలవరపు శ్రీనివాస్ ఇంట్లో ఈ దోపిడి జరిగింది. ఇంట్లోని  25 తులాల బంగారం, 50 కిలోల వెండి, 2లక్షల నగదు, ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు కారును కూడా దొంగలు చోరీ చేశారు. జులై 31 న తిరుపతి వెళ్లిన శ్రీనివాస్ …. ఇవాళ ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి అంతా దోపిడీ చేశారు. సీసీ కెమెరాలను ధ్వసం చేయడంతో పాటు హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లారు.  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నాయి.