కొబ్బరి నీళ్లలో మత్తుమందు కలిపి.. ఐటీ రిటైర్డ్ కమిషనర్ ఇంట్లో భారీ చోరీ

కొబ్బరి నీళ్లలో మత్తుమందు కలిపి.. ఐటీ రిటైర్డ్ కమిషనర్ ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ లో ఐటీ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. భూమి కొనుగోలు చేస్తామని ఇంట్లోకి వెళ్లి  చోరీకి పాల్పడ్డాడు నిందితుడు. 5 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారంతో ఉడాయించాడు.

భూమి కొనుగోలు పేరుతో సురేందర్ అనే వ్యక్తి రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ కు  దగ్గరయ్యాడు. ఓ రోజు టిఫిన్, కొబ్బరినీళ్లతో  శామ్యూల్  ఇంటికి వెళ్లిన సురేందర్.. కొబ్బరి నీళ్లలో మత్తు మందు కలిపి ఇచ్చాడు.  కొబ్బరి  నీళ్లు తాగిన శామ్యూల్ సృహ తప్పి పడిపోగానే చోరీకి పాల్పడ్డాడు సురేందర్. 5 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లాడు.  జూన్ 14న రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.నిందితుడు సురేందర్ ను అదుపులోకి తీసుకున్నారు ముషీరాబాద్ పోలీసులు. అయితే తన వెనుక ఓ ఎస్సై హస్తం ఉందని చెప్పాడు సురేందర్. నిందితుడు చెప్పిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ:కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది: ఎంపీ అర్వింద్