ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం

ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం

న్యూ ఇయర్ రోజున సిటీలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ప్రధాన రూట్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. జనవరి ఫస్ట్ కావటంతో జనం ఆలయాలకు భారీగా తరలివచ్చారు. గుళ్ల వద్ద పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో చాలా మంది వాహనాలను రోడ్లపైనే నిలిపారు. ముఖ్యంగా రోడ్ నెంబర్ 12, 13లో హెవీ ట్రాఫిక్ కనిపిస్తోంది. రోడ్ నెంబర్ 12లోని పూరీ జగన్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఎన్టీఆర్ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు ట్రాఫిక్ జాం అయింది. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, డైమండ్ హౌజ్, రోడ్ నంబర్ 45లో ట్రాఫిక్ జాంతో రద్దీగా మారింది. KBR పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రూట్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. ఉదయం 11 గంటల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడేందుకు జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 10 నిమిషాల దూరాన్ని దాటేందుకు 45 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్ పోలీసులు సరైన ప్లాన్ చేయకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని జనం మండిపడుతున్నారు.