
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ వద్ద ఓ భారీ ట్రక్కు బెంగుళూరు జాతీయ రహదారి పై నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి పై ఇరువైపుల దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ట్రక్కు ను తొలగించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
TN 47, AT 4858 నంబర్ గల ఓ భారీ ట్రక్కు శంషాబాద్ వైపు నుంచి షాద్ నగర్ వైపు వెళ్తున్నది. శంషాబాద్ మండలం లోని పెద్దషాపూర్ వద్ద కు చేరుకోగానే ట్రక్కు ను యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించాడు డ్రైవర్. రోడ్డు మధ్యలోకీ రాగానే ట్రక్కు పాడైపోయింది. దీంతో 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రయాణీకుల సాయంతో అతి కష్టం మీద ట్రక్కు ను పక్కకు తప్పించారు. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు