
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషించగా, గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ మారుతి విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీతో ప్రారంభమైన టీజర్.. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్‌ను కూడా చూపించడంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. చేతన్ కృష్ణ చేసిన విలేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ పెళ్లి సందడిలో డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్, కామెడీతో పాటు గోపీ సుందర్ సంగీతంతో టీజర్ ఇంప్రెస్ చేసింది. నవంబర్ 8న సినిమా రిలీజ్ కానుంది.