సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రత్యేకతలు

సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రత్యేకతలు

త‌మిళ‌నాడులో ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలి సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ తో పాటు మరో 11 మంది మృతిచెందారు. బుధవారం మ‌ధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు ప్రకటించారు.  రావత్ ప్రయాణించిన ఎంఐ 17 హెలికాప్ట‌ర్ చాలా కాలం నుంచి వైమానిక ర‌క్ష‌ణ ద‌ళంలో ఉంది. ఈ హెలికాప్టర్ వీ5 వ‌ర్షెన్ కు చెందిన అత్యాధునిక‌మైంది. ఈ టైప్ హెలికాప్ట‌ర్‌తో ప్ర‌మాదాలు జరిగే అవకాశం తక్కువ. అయితే ఈ ప్రమాదం పొగ మంచు వల్ల జరిగుండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని మాజీ ఎమ్‌ఐ-17 పైలెట్‌ అమితాబ్‌ రంజన్‌ అన్నారు. రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్‌పోర్ట్ 2008లో భారత ప్రభుత్వంతో 80 Mi-17V5 హెలికాప్టర్‌లను పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఎంతో నమ్మకమైన హెలికాప్టర్‌గా ఉన్న ఈ ఎంఐ17వీ5లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

1. ఎంఐ 17వీ5 అనేది రష్యన్ హెలికాప్టర్‌. దీనిని కజాన్ హెలికాప్టర్స్ తయారు చేసింది. ఈ హెలికాప్టర్ లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒకటి ఫెయిలైనా మరోకటి పనిచేస్తుంది.
2. ఎంఐ 8/17 ఫ్యామిలీకి చెందిన మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ వేరియంట్ ఇది.
3. ఎంఐ 17వీ5 చాపర్స్ అనేవి ఎంఐ 8/17లోనే మోస్ట్ టెక్నికల్లీ అడ్వాన్స్‌డ్ హెలికాపర్లు.
4. ఈ హెలికాప్టర్ గరిష్ట టేకాఫ్ వెయిట్ 13 వేల కేజీలు. ఇది ఒకేసారి 36 మంది సైనికులను సులభంగా గమ్యస్థానాన్ని తీసుకెళ్లగలదు.
5. ఇండియాలోని ప్రతి ఎంఐ17వీ5 హెలికాప్టర్‌లోనూ కాంప్లెక్స్ నావిగేషన్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే కేఎన్ఈఐ 8 ఫీచర్లు ఉన్నాయి.
6. క్యాబిన్ లోపల కార్గో రవాణకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు.
7. ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్లలో ఇది ఒకటి.
8. వీటికి ఫైర్ సపోర్ట్ ఫీచర్ ఉంది. ప్యాట్రోల్‌కు కూడా ఉపయోగిస్తారు. సెర్చ్ అండ్ రిస్క్యూ మిషన్లకు కూడా వీటిని ఉపయోగిస్తారు. ఐఏఎఫ్‌ దగ్గర ప్రస్తుతం 200కు హెలికాప్టర్లు ఉన్నాయి. 
9. ఎంఐ 17వీ5 హెలికాప్టర్‌లో క్షిపణులు, ఎస్ 8 రాకెట్లు, 23 ఎంఎం మెషీన్ గన్, పీకేటీ మెషీన్ గన్స్, ఏకేఎం సబ్‌మిషన్ గన్స్ వంటివి ఉంటాయి. వీటి ద్వారా పైనుంచి కింద ఉన్న ఏ లక్ష్యాన్ని అయినా టార్గెట్ చేస్తాయి.
10.ఈ హెలికాప్టర్ మొదటిసారిగా ఫిబ్రవరి 17, 2012న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చి చేరింది.