ఆగస్టు 2న హలో మాల.. చలో పెద్దపల్లి

ఆగస్టు 2న హలో మాల.. చలో పెద్దపల్లి

గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్​ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామికి ఆగస్టు 2న పెద్దపల్లిలో జరగనున్న ఆత్మీయ పౌర సన్మానం సందర్భంగా ‘హలో మాల.. చలో పెద్దపల్లి’ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలిరావాలని మాల సంఘం గోదావరిఖని అధ్యక్షుడు సోగాల వెంకటి, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య పిలుపునిచ్చారు. 

ఆదివారం గోదావరిఖని సంఘం ఆఫీస్​లో కార్యక్రమం వాల్​పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎరుకల లక్ష్మణరావు, టీం ఉపాధ్యక్షుడు అందుగుల రాజేశం, మాలసంఘం కో ఆర్డినేటర్​ నంది నరేశ్‌‌‌‌‌‌‌‌, సీనియర్ లీడర్లు సుదర్శన్, లింగయ్య, రాజు, లింగమూర్తి, రమేశ్‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్వర్లు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.