నరేశ్,కరాటే కల్యాణిలపై ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు

V6 Velugu Posted on Oct 06, 2021

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఏమాత్రం తక్కువ కాని విధంగా నటీనటులు..ప్రత్యర్ధులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో బాగంగా ఇవాళ(బుధవారం) నరేశ్, కరాటే కల్యాణిలపై ' MAA ' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

తనపై నరేశ్ , కల్యాణి అసభ్య వ్యాఖ్యలు చేశారని, అసభ్య వ్యాఖ్యలతో కూడిన వీడియోను విడుదల చేశారని లేఖలో తెలిపారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కళ్యాణి,నరేష్ లు పోస్ట్ చేసిన వీడియోలను అయా యూ ట్యూబ్ చానల్స్ నుంచి తొలగించేలా చేయాలని పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు..వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా లింక్ ను కూడా ఎన్నికల అధికారికి పంపారు. అక్టోబర్ 10న జరగనున్న  MAA  ఎన్నికల్లో నరేశ్, కరాటే కల్యాణిలు ఓటు వేయకుండా నిషేధం విధించాలని లేఖలో కోరారు హేమ.

Tagged Hema complains, election official, Naresh, karate kalyani

Latest Videos

Subscribe Now

More News