ముంబై ఢమాల్..చెన్నై టార్గెట్-156

ముంబై ఢమాల్..చెన్నై టార్గెట్-156

చెన్నై :IPL సీజన్-12లో భాగంగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 రన్స్ చేసింది. బిగ్ స్కోర్ చేసే క్రమంలో వరుస వికెట్లను చేజార్చుకుంది ముంబై. ఆడుతారనుకున్న డికాక్, కృనాల్, హార్ధిక్, పొలార్డ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా..లివీస్ (32) ఫర్వాలేదనిపించాడు.

ముంబై ప్లేయర్లలో..రోహిత్(67), డికాక్(15), లివీస్(32), కృనాల్(1), హర్ధిక్(23), పొలార్డ్(13) రన్స్ చేశారు

చెన్నై బౌలర్లలో.. సాట్నర్(2) చహర్(1), ఇమ్రాన్ తాహీర్(1) వికెట్లు తీశారు.