
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay Thalapathi) ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) పేరుతో పార్టీని ఏర్పాటు చేసి.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ చేసిన పనికి తన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే..విజయ్ తల్లి దండ్రులకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారన్న న్యూస్ సోషల్ మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే. కానీ, చాలా మందికి తన తల్లి శోభ అంటే విజయ్ కి చాలా ఇష్టం అని కొంతమందికి మాత్రమే తెలుసు.ఆ ప్రేమ ఎంతలా అంటే..మాటల్లో చేతల్లో చూపించే దానికంటే..ఉప్పొంగిపోయే మనసుతో ఆమె కోసం ఆలయాన్ని కట్టించేంతలా.
చెన్నైలోని కొరట్టూర్‌లో తన స్థలంలో సాయిబాబా గుడిని విజయ్ కట్టించారనే న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు తన తల్లి కోసం కట్టిన ఆ ఆలయంలో కుంబాభిషేకాలు, ప్రత్యేక పూజలు కూడా విజయ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ చేసిన ఈ పనికి అందరు సలాం కొడుతున్నారు.
Also Read :ఆ ఒక్కటీ అడక్కు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న రెండు బడా బ్యానర్స్
విజయ్ సినిమాల విషయానికి వస్తే..విజయ్ ఇప్పటి వరకు 68 చిత్రాలలో నటించి..ఎన్నో అవార్డ్స్ తో పాటు పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. విజయ్ కి అంతర్జాతీయ స్థాయిలో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం విజయ్ క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkatprabhu) డైరెక్షన్‌లో ద గోట్(The Greatest of All Time) అనే టైం ట్రావెల్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ విజయ్ 68 వ చిత్రంగా రాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) విజయ్కి జోడీగా నటిస్తుంది.