టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna)ఇవాళ మంగళవారం (అక్టోబర్ 22న) వరదలో చిక్కుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కల్యాణి జువెల్లర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం అనంతపురం బయలుదేరిన నాగార్జున వరదల్లో చిక్కుకుపోయారు.
ఈ ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుండి పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న నాగార్జున.. అక్కడి నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో నిర్వాహకులు ఆయనను మరో మార్గంలో అనంతపురం చేర్చారు. ఆ తర్వాత నగల దుకాణాన్ని ప్రారంభించారు. నాగార్జునను చూసేందుకు వందలాదిమంది తరలివచ్చారు.
Also Read :- స్పెషల్ పోస్ట్తో థ్యాంక్స్ చెప్పిన నయనతార
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గత కొన్నేళ్లుగా నాగార్జున జ్యువెల్లరీ సంస్థ కళ్యాణ్ జ్యువెల్లర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇదెక్కడి మాస్ రా మావా...ఇరవై మ౦ది బౌన్సర్లతో మన కి౦గ్... కుత్తర్యా౦ప్ 💥
— King Venky (@KingVenkyKv) October 22, 2024
Jai Nagarjuna @iamnagarjuna #Coolie 🔨 #Nagarjuna #NagarjunaAkkineni pic.twitter.com/SDdrhEiw9F
అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని రోజులనుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లా లోని పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు పొంగిపొర్లుతుండటంతో పలు కాలనీలో ఇప్పటికే పూర్తిగా జలమయమయ్యాయి.