
హీరో అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. ఆయన కూతురు ఐశ్వర్య, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. సోమవారం తన బర్త్‌డే సందర్భంగా ధృవ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ధ్రువ సర్జా యాక్షన్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు. ఈ చిత్రంలో అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.