యంగ్ టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేసేలా..

యంగ్ టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేసేలా..

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్వహించిన  ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ ఈవెంట్‌‌‌‌ శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘యువ ప్రతిభని ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. అలాంటి అవకాశం ఈ వేదిక ఇచ్చింది. 

ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్‌‌‌‌ని  ప్రజెంట్ చేస్తున్న వారంతా సూపర్ సక్సెస్ అవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆహా వారి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మురళీ మోహన్, తనికెళ్ల భరణి, అల్లు అరవింద్, టీజీ విశ్వ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, వంశీ పైడిపల్లి, బాబీ, సందీప్ కిషన్, తేజ సజ్జా  తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.