ఓ అమ్మాయి అసభ్యంగా తాకింది.. వైరలవుతున్న దుల్కర్ కామెంట్స్

ఓ అమ్మాయి అసభ్యంగా తాకింది.. వైరలవుతున్న దుల్కర్ కామెంట్స్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఒక లేడీ ఫ్యాన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనతో ఒక అమ్మాయి అసభ్యంగా ప్రవర్తించిందని, నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అదోలా బిహేవ్ చేసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న మూవీ కింగ్స్ ఆఫ్ కొత(Kings of kotta). ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దుల్కర్. ఇందులో భాగంగా యాకర్.. మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ కదా.. ఎప్పుడైనా వారివల్ల ఇబ్బంది పడ్డారా అని అడిగారు. దానికి సమాధానంగా దుల్కర్ మాట్లాడుతూ.. నాకు లేడీ ఫ్యాన్సే కాదు అబాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉంటాను. కానీ ఒక సంధర్భంలో ఒక లేడీ ఫ్యాన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఒకసారి సినిమా ఫంక్షన్ కోసంస్టేజిపై ఉండగా.. అందరూ చూస్తుండగానే..  ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది. అంత మంది ముందు ఆమె అలా చేసేవరకూ ఆక్షణం ఎం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను చాలా ఇబ్బందిపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.