
కంటెట్ పరంగా గానీ, క్వాలిటీ పరంగా గానీ మలయాళ(Malayalam movies) సినిమాలు చాలా బాగుంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా.. కంటెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మలయాళ మేకర్స్. అందుకే వాళ్ళకి సక్సెస్ రేటు ఎక్కువ. ఇక తాజాగా మళయాళ ఇండస్ట్రీ నుండి వస్తున్న మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ "ధూమం(Dhoomam)". ఫహద్ ఫాజిల్( Fahadh Faasil) హీరోగా వస్తున్న ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్(Pawan kumar) తెరకెక్కిస్తున్నాడు. కెజీఎఫ్(KGF), కాంతారా(Kantara) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన హోంబలే ఫిలిమ్స్(Hombale filans) ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు కూడా బాగానే ఏర్పడ్డాయి. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా నుండి తాజాగా ధూమం ట్రైలర్(Dhoomam Trailer) రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
తాను ప్లాన్ చేసిన సరికొత్త స్మోక్ వార్నింగ్ యాడ్ ను ఫహద్ కంపెనీ బోర్డు మెంబర్స్ కు వివరించడంతో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్విస్ట్స్, యాక్షన్, చేజింగ్, థ్రిల్లింగ్ సీన్స్ తో టీజర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ఒక్కో సీన్ ఒక్కో షాట్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆర్టిస్టుల పర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. నార్మల్ సినిమను కాకుండా ఎదో కొత్త కాన్సెప్ట్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగించాడు డైరెక్టర్ పవన్.
నిజానికి పవన్ కుమార్ ఇలాంటి థ్రిల్లగ్ కథలు తీయడం కొత్తేమి కాదు. ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన యూ టర్న్, కుడి ఎడమైతే సినిమాలు కూడా మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమాలు చూసిన ఆడియన్స్ కూడా అనెక్స్పెక్టెడ్ థ్రిల్ ను ఫీల్ అయ్యారు. ఇప్పుడు మరోసారి అంతకు మించి థ్రిల్ ను పంచేందుకు సిద్దమయ్యాడు పవన్.
వినూత్న కాన్సెప్ట్ తో రానున్న ధూమం సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి థ్రిల్ ను ఇవ్వనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.