11 ఏండ్ల ప్రేమ: పెండ్లి చేసుకోబోతున్న హీరో కార్తికేయ

V6 Velugu Posted on Aug 23, 2021

Rx100 సినిమాతో వెండి తెరకు పరిచయమై తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటున్న హీరో కార్తికేయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ స్టార్‌‌ హోటల్‌లో అతి కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నిన్న నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ తాను పెండ్లాడబోతున్న అమ్మాయి గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో సోమవారం రాత్రి అమ్మాయితో పాటు ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. తన బెస్ట్ ఫ్రెండే ఇప్పుడు లైఫ్ పార్ట్‌నర్ కాబోతోందని ట్వీట్ చేశాడు. ఆమె పేరు లోహిత అని, తనను ఫస్ట్‌ టైమ్‌ 2010లో వరంగల్ ఎన్‌ఐటీలో కలిశానని చెప్పాడు.

‘‘నా బెస్ట్ ఫ్రెండ్‌ ఇప్పుడు నా లైఫ్ పార్ట్‌నర్ కాబోతోంది. 2010లో తొలిసారి వరంగల్ ఎన్‌ఐటీలో లోహితను కలిశాను. అప్పటి నుంచి మా బంధం ఇలా సాగుతోంది. ఇది జీవిత కాలపు ప్రేమ ప్రయాణం.. తనతో ఎంగేజ్‌మెంట్ అయిందని అనౌన్స్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది” అంటూ వాళ్లు అప్పట్లో దిగిన ఫొటోతో పాటు, నిన్న ఎంగేజ్‌మెంట్‌లో తీసుకున్న ఫొటోను కలిపి కార్తికేయ ట్వీట్ చేశాడు.

కాగా కార్తికేయ కరోనా టైమ్‌లో ‘చావు కబురు చల్లగా..’ సినిమాతో జనాలను అలరించాడు. ఇప్పుడు అజిత్‌తో ‘‘వాలిమై’’ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే ‘‘రాజా విక్రమార్క”అనే మరో సినిమా చేస్తున్నాడు.

Tagged Love Marriage, Engagement, warangal nit, best friend, Hero Kartikeya

Latest Videos

Subscribe Now

More News