డాన్ దర్శకుడితో నాని సినిమా.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

డాన్ దర్శకుడితో నాని సినిమా.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్

నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే దసరా(Dasara) సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం శౌర్యవ్(Shouryuv) అనే కొత్త దర్శకుడితో హాయ్ నాన్న(Hi Nanna) అనే సినిమా చేస్తన్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే.. నాని తరువాతి సినిమాపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళంలో శివకార్తికేయ హీరోగా వచ్చిన డాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సిబి చక్రవర్తితో నాని తరువాతి సినిమా చేయనున్నాడట. ఈ దర్శకుడు చెప్పిన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నానికి తెగ నచ్చేసిందట. దాంతో వెంటనే ఈ ప్రాజెక్టు కు ఓకే చెప్పాడట నాని. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అధికారిక ప్రకట త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం.