 
                                    స్వామిరారా, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం లాంటి వరుస విజయాలు సొంతం చేసుకున్న యంగ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారు. డాక్టర్ పల్లవి వర్మను గురువారం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు.
ప్రపంచం మెత్తాన్ని కరొనా మహమ్మారి వ్యాపించి ఎక్కడి వారిని అక్కడే వుండేలా మనుషుల మద్య దూరం వుండేలా చేసింది. ఈ పరిస్థితిలో నిఖిల్ పెళ్ళి వాయిదా వేసుకున్నారు. అయితే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అనే పెద్దల సామెత నిజమవుతుంది. లాక్‌డౌన్ తరువాత మూఢం రావటం.. ముహుర్తాలు లేకపోవటం వలన వదువరులు ఇద్దరి జాతకాల రీత్యా గురువారం (మే 14) ఉదయం 6:31 ని”లకు పెళ్ళి చేయటానికి ఇరు పెద్దలు నిర్ణయించారు. అయితే సోషల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లొజ్ సర్కిల్ ని మాత్రమే పిలిచి షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెళ్ళి చేయ నిశ్చయించారు. ఈ పెళ్ళి లో ప్రభుత్వం సూచించే అన్ని పద్దతులు పాటిస్తున్నారు.
అభిమానుల మద్యలో ఈ పెళ్ళి ని ఆఢంబరంగా చేసుకొవాలనుకున్న నిఖిల్ ఇప్పడు ఈ పరిస్థుతుల్లో కొవిడ్-19 వ్యాప్తి చెందకూడదనే వుద్ధేశ్యం తో ఈ పెళ్ళి ఇలా నిరాఢంబరంగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంభందించిన ఫోటోస్, వీడియోస్ మాత్రం ఫ్యాన్స్ కి సోషల్ మీడియా ద్వారా అందించనున్నారు.

 
         
                     
                     
                    