డాక్టర్గా చేయలేకపోయిన పనిని పోలీస్గా చేశాడు

డాక్టర్గా  చేయలేకపోయిన పనిని పోలీస్గా చేశాడు

హీరో రామ్ మాస్ హీరో గా ఎస్టాబ్లిష్ కావడం కోసం ముందు నుంచి బాగా ట్రై చేస్తున్నాడు. అప్పుడప్పుడు హిట్లు వచ్చినా.. పూర్తి స్థాయి మాస్ స్టార్ గా ఎదగడానికి శ్రమిస్తున్నాడు. ఈ సారి తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో కలిసి ‘‘ది వారియర్’’ అనే పోలీస్ కథను చేశాడు. మరి ఈ సినిమాతో రామ్ కు మాస్ స్టార్ ఇమేజ్ వచ్చిందో లేదో తెలుసుకుందాం.

ఈ కథ విషయానికొస్తే.. సత్య అనే డాక్టర్ ఉద్యోగం కోసం కర్నూల్ కి వస్తాడు. అక్కడ గురు అనే పెద్ద రౌడీ చేసే అరాచకాలు చూసి రగిలిపోతాడు. కానీ సత్యకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. గురుని చూసి అంతా భయపడతారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి కూడా ధైర్యం ఉండదు. సత్య కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా తన బినామీ పేరు మీద ఉన్న ఇల్లీగల్ ఫార్మా కంపెనీ క్లోజ్ చేయిస్తాడు. దాంతో పగ పెంచుకున్న గురు సత్యను చావ బాదుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. సత్య గురు మీద ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనేది కథ.

‘‘ది వారియర్’’ రెగ్యులర్ మాస్ కథ. దీంట్లో ఎలాంటి కొత్తదనం లేదు. డాక్టర్ గా తాను చేయలేకపోయిన పనిని పోలీస్ గా మారి తన పగ తీర్చుకోవడమనేది కాస్త కొత్త పాయింట్. మిగతా అంతా రొటీన్. తమిళ కమర్షియల్ డైరెక్టర్ లింగుస్వామి నుంచి ఇంత కంటే మంచి కథ ఎక్స్ పెక్ట్ చేయలేం. కానీ ఎట్ లీస్ట్ ట్రీట్ మెంట్ అయినా కొత్తగా ఉండాల్సింది. కానీ డైరెక్టర్ ఏ దశలోనూ కొత్తగా ట్రై చేయలేదు. చాలా వీక్ నేరేషన్ తో బోర్ కొట్టించాడు. రామ్ ఎందుకు ఈ కథ చేశాడో అర్థం కాదు.
 
ఫస్టాఫ్ కాస్త ఫర్వాలేదు. లవ్ ట్రాక్ తో ఫన్ గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంది. కానీ సెకండాఫ్ వచ్చేసరికి నీరసం వస్తుంది. కర్నూలు లోని జనాలకు మంచి చేయడం మరిచిపోయి హీరో తన సొంత పగ తీర్చుకుంటాడు. అది కూడా డి.ఎస్.పి పొజిషన్ లో. ఇంటర్వెల్ సమయానికే క్లైమాక్స్ ఎలా ఉంటుందో చెప్పేసే పాత చింతకాయ పచ్చడి కథ ఇది. 

రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాగా నటించి మెప్పించాడు. కానీ మాస్ హీరో ఇమేజ్ కోసం విఫలయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. డాన్సులు, ఫైట్లు, లుక్స్ తో ఆకట్టుకున్నాడు. కృతి శెట్టి బొద్దుగా కనిపించింది. యాక్టింగ్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఆది పినిశెట్టి మాత్రం విలన్ గా అదరగొట్టాడు. గురు పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేశాడు. నదియా రెగ్యులర్ మదర్ క్యారెక్టర్ లో కనిపించింది. జయ ప్రకాష్ , పోసాని, శరణ్య ప్రదీప్ తదితరులు ఆకట్టుకుంటారు.

సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూయ్స్ అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. సాయి మాధవ్ బుర్రా డైలాగులు ఆకట్టుకోలేవు. ఓవరాల్ గా ‘‘ది వారియర్’’ డిజప్పాయింట్ చేస్తుంది. కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం వల్ల హీరో విలన్ ల ఫైట్ వీక్ గా అనిపిస్తుంది. బలమైన స్క్రీన్ ప్లే ఉండుంటే ఈ కథ బాగా వర్కవుట్ అయ్యేది. అద్భుతం ఉందంటే తప్ప థియేటర్లకు కదలడం లేని జనాలకు ఈ సినిమా అస్సలు నచ్చదు. ఓటీటీలో కూడా ఫార్వర్డ్ చేసుకుని చూసే సినిమాల లిస్ట్ లో ఇది చేరిపోతుంది.

రివ్యూ: ది వారియర్

రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు

నటీనటులు : రామ్, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, నదియా, జయ ప్రకాష్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్

డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా

మ్యూజిక్ : దేవీ శ్రీ ప్రసాద్

నిర్మాత: చిత్తూరు శ్రీనివాస్

రచన,దర్శకత్వం: లింగుస్వామి

రిలీజ్ డేట్: జులై 14,2022