Madharaasi: బిగ్ స్క్రీన్‌‌పై ‘మదరాసి’ చింపేస్తుంది.. శివ కార్తికేయన్ కామెంట్స్తో అంచనాలు రెట్టింపు

Madharaasi: బిగ్ స్క్రీన్‌‌పై ‘మదరాసి’ చింపేస్తుంది.. శివ కార్తికేయన్ కామెంట్స్తో అంచనాలు రెట్టింపు

శివ కార్తికేయన్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘మదరాసి’. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ (సెప్టెంబర్ 5న) విడుదలైంది. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ చెప్పిన మదరాసి విశేషాలు ఇలా ఉన్నాయి.

‘‘ఈ  కథ చాలా కొత్తగా ఉంటుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఎమోషన్, యాక్షన్ పరంగా బిగ్ స్క్రీన్‌‌పై సెలబ్రేట్ చేసుకునేలా సినిమా ఉంటుంది. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్‌‌ని డైరెక్ట్ చేసిన  మురుగదాస్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.

హీరోయిన్ గురించి మాట్లాడుతూ.. రుక్మిణీ వసంత్ పాత్ర కీలకంగా ఉంటుంది. కథకి ఎమోషన్ యాడ్ చేసే రోల్ తనది. అలాగే, ఈ సినిమాలో మరో రెండు పిల్లర్స్ విద్యుత్ జమ్వాల్, బీజు మీనన్. విద్యుత్ జమ్వాల్‌‌తో చేసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. బీజు మీనన్ రోల్ కీలకంగా ఉంటుంది. ఇక అనిరుధ్ మ్యూజిక్ మరింత స్పెషల్‌‌గా ఉంటుంది. సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ,  శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా రిచ్‌‌గా ఉంటాయి.

టెక్నికల్‌‌గా ఆడియెన్స్‌‌కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటివరకు నా సినిమాలు రెమో, వరుణ్ డాక్టర్, డాన్, మహావీరుడు, అమరన్‌‌ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి  మంచి సపోర్ట్ దక్కింది. ఈ సినిమాను కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అని శివకార్తికేయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ వస్తోంది.