
రాజకీయ పార్టీలు ప్రజలకు లంచాలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాయన్నారు సినీ నటుడు సుమన్. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సుమన్. తర్వాత మీడియాతో మాట్లాడిన సుమన్ రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని అన్నారు. ప్రజలను అభిమానంతో కాకుండా లంచాలతో కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు డబ్బులకు లొంగకుండా సరైన నాయకుడిని ఎంచుకోవాలని సూచించారు.