డబ్బింగ్ వర్క్‌‌‌‌లో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’

డబ్బింగ్ వర్క్‌‌‌‌లో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’

రీసెంట్‌‌‌‌గా ‘అనగనగా’ చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించిన సుమంత్.. ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’ అంటూ థియేటర్స్‌‌‌‌కు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో మధు కాలిపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, తాజాగా డబ్బింగ్  కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. సుమంత్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను విడుదల చేసిన మేకర్స్.. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని అని అన్నారు.

సోసియో ఫాంటసీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.