గోదారి గట్టుపైన మూవీకి మౌత్ టాక్‌‌‌‌ తోనే విజయం వచ్చింది: హీరో సుమంత్ ప్రభాస్ 

గోదారి గట్టుపైన మూవీకి మౌత్ టాక్‌‌‌‌ తోనే విజయం వచ్చింది: హీరో సుమంత్ ప్రభాస్ 

‘గోదారి గట్టుపైన’ చిత్రం  తనకు  కొత్త ఆడియెన్స్‌‌‌‌ను పరిచయం చేసిందని అన్నాడు హీరో సుమంత్ ప్రభాస్. తను హీరోగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ నిర్మించిన ఈ చిత్రం మే 8న విడుదలై పదిరోజులుగా సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సోమవారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ‘నా నుంచి  మూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘ఎవరైనా టికెట్ కొంటారా’ అని కొందరు హేళన చేశారు.  

కానీ మేము థియేటర్లు విజిట్ చేస్తూ పల్లెటూర్లలో తిరిగినప్పుడు అక్కడ  కనిపించిన ఎనర్జీ మామూలుగా లేదు.  ఫ్యామిలీలతో థియేటర్లు కళకళలాడడం  ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.  ఈ చిత్రాన్ని  ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు.  తను పోషించిన మాయ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు వస్తోన్న రెస్పాన్స్ సంతోషాన్ని ఇచ్చిందని హీరోయిన్ నిధి ప్రదీప్ చెప్పింది. డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ ‘మా చిత్రం  10 రోజుల్లో రూ.8.6 కోట్ల గ్రాస్ సాధించడం మాకు చాలా గొప్ప విషయం. 

ఇది పూర్తిగా ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది. మనుషులందరూ మంచివాళ్లే. కానీ పరిస్థితుల వల్ల వారి ప్రవర్తన మారుతుంది. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. మా నమ్మకాన్ని ఆడియెన్స్ నిలబెట్టారు’ అని అన్నాడు. మౌత్‌‌‌‌ టాక్‌‌‌‌తోనే ఈ సినిమా నిలబడిందని, సెకండ్ వీక్‌‌‌‌ నుంచి మరింత ఆదరణ దక్కుతోందని నిర్మాత అభినవ్ రావు అన్నారు. నటులు దేవిప్రసాద్, సుదర్శన్, రాజ్‌‌‌‌కుమార్ కసిరెడ్డి పాల్గొన్నారు.