చెన్నై వరద బాధితులకు రూ.10 లక్షల సాయం అందించిన హీరో సూర్య, కార్తీ

చెన్నై వరద బాధితులకు రూ.10 లక్షల సాయం అందించిన హీరో సూర్య, కార్తీ

తమిళనాడులో భారీగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై మొత్తం నీటమునిగిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బలమైన ఈదురుగాలులకు వృక్షాలు నేల రాలుతున్నాయి. నదులు, డ్రైనేజీలు పొంగి పోతుండటంతో చాలా మంది నిరాశ్రయులు అవుతున్నారు. 

ఈ వరదల కారణంగా ఇప్పటికే 8 మంది మృతి చెందారని సమాచారం. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు NDRF, SDRF బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. దీంతో.. వరదబాధితులను ఆదుకునేందుకు హీరో సూర్య , అతని సోదరుడు కార్తీ ముందుకు వచ్చారు. బాధితులకు 10లక్షల రూపాయిల ఆర్థిక సాయన్నీ ప్రకటించారు. దీంతో సూర్య ఫ్యాన్స్ తమ హీరో స్పందించిన తీరుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు తన సేవాగుణాన్ని చాటుకున్నారు సూర్య. పలు చారిటీ సంస్థలు కూడా నిర్వహిస్తున్నారు.