మ్యారేజ్ లైఫ్ అంటే ఇలానే ఉండాలి.. పెళ్లిపై విజయ్ కామెంట్స్

మ్యారేజ్ లైఫ్ అంటే ఇలానే ఉండాలి.. పెళ్లిపై విజయ్ కామెంట్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). క్లాసిక్ సినిమాలా దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. మైత్రి మూవీ మేకర్స్(Mytri movie makers) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

ఆరాధ్య(Aradhya) అంటూ సాగే ఆ పాటకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ పై తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు హీరో విజయ్ దేవరకొండ. ఖుషి సినిమాలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. కొత్తగా పెళ్లయిన భార్యభర్తలు ఎలా ఉండాలో ఈపాటలో చూపించారు శివ. ఆ జంట మధ్య ఉండే ప్రేమ,అనుబంధాన్ని చాలా అందంగా చూపించారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ..భవిష్యత్తులో నా పెళ్లి జీవితం లైఫ్‌ ఈ పాటలో ఉన్నట్టుగానే ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు విజయ్‌. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్ చుసిన విజయ్ అభిమానులు త్వరగా పెళ్లి చేసుకో అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఖుషీ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మళయాళ సెన్సేషన్ హేశం అబ్దుల్ వాహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.