‘కోబ్రా’లో 25 డిఫరెంట్ గెటప్స్ లో విక్రమ్

‘కోబ్రా’లో 25 డిఫరెంట్ గెటప్స్ లో విక్రమ్

కొత్తరకం చిత్రాలను ఇష్టపడే విక్రమ్,  ‘కోబ్రా’ అంటూ  మరో ఎక్స్‌‌‌‌పెరిమెంట్‌‌‌‌తో   ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇందులో  విక్రమ్ దాదాపు ఇరవై ఐదు డిఫరెంట్ గెటప్స్‌‌‌‌లో కనిపించనున్నాడు. అజయ్ జ్ఞానముత్తు  దర్శకుడు. ‘కేజీయఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్‌‌‌‌గా ఈ మూవీ విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్‌‌‌‌ను ఎన్వీఆర్ సినిమా సొంతం చేసుకున్నట్టు నిన్న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇప్పటికే విక్రమ్‌‌‌‌కి సంబంధించిన కొన్ని లుక్స్,  టీజర్, సాంగ్స్‌‌‌‌తో సినిమాపై ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్ పెంచారు మేకర్స్.  క్రికెటర్ ఇర్ఫాన్‌‌‌‌ పఠాన్‌‌‌‌ ఇంపార్టెంట్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడు. మృణాళిని రవి, రోషన్‌‌‌‌ మాథ్యూ, మియా జార్జ్‌‌‌‌, కెఎస్‌‌‌‌ రవికుమార్‌‌‌‌ ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాను ఎస్ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.