అది నయనతార హక్కు.. హీరో విశాల్

అది నయనతార హక్కు.. హీరో విశాల్

లేడీ సూపర్​ స్టార్​ నయనతార(Nayanthara) తో సినిమా అంటే దర్శకనిర్మాతలు జంకుతారట. సినిమా సైన్​ చేసేముందే ప్రమోషన్స్​లో పాల్గొనను అని కండీషన్​ పెట్టేస్తుంది. ఇది ఓకే అనుకున్న వారే తనతో సినిమాకు ముందుకొస్తుంటారని టాక్​. 

ఇదే విషయాన్ని తమిళ నడిగర్​ సంఘం సభ్యుడు, హీరో విశాల్(Vishal) ​ను మీడియా ప్రశ్నించింది. దీంతో ఈ హీరో నయన్​ను వెనకేసుకొచ్చాడు. ప్రమోషన్స్​లో పాల్గొనకపోవడం తప్పుకాదు. అది తన నిర్ణయం మనం దానిని మార్చలేం. తన నిర్ణయాన్ని చెప్పే హక్కు తనకుంది..అంటూ తెలిపాడు. 

నయన్​ ఫ్యాన్స్​ సైతం విశాల్​ కామెంట్స్​పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి 2008లో వచ్చిన..సెల్యూట్.. సినిమాలో నటించారు. ప్రస్తుతం నయన్​ బాలీవుడ్​లో షారుక్​ ఖాన్​తో జవాన్​ సినిమాలో నటిస్తోంది.