మీకు లోకల్ అమ్మాయిలు నచ్చరా? డిమాండ్ లేదు.. అయినా వాళ్ళే కావాలి

మీకు లోకల్ అమ్మాయిలు నచ్చరా? డిమాండ్ లేదు.. అయినా వాళ్ళే కావాలి

టాలీవుడ్ ఇండస్ట్రీ మేకర్స్ కు తెలుగు అమ్మాయిలు నచ్చారా? అని ప్రశ్నిస్తోంది నటి ఈషా రెబ్బ(Eesha rebba). టాలెంట్ ఉన్నా కూడా వారిని పట్టించుకోవడం లేదు అంటూ ఘాటుగా స్పందించింది. తాజాగా ఆమె హీరోయిన్ గా చేస్తున్న సినిమా.. దయా(Daya). జేడీ చక్రవర్తి(JD Chakravarthy) ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొంది ఈ బ్యూటీ.

ఇందులో భాగంగా టాలీవుడ్ మేకర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్బంగా మాట్లాడిన ఈషా.. "దయ సినిమా ఒక మంచి యాక్షన్ ఫిలిం. కేవలం యాక్షన్ మూవీలో నటించాలనే ఆశతోనే ఈ సినిమాలో యాక్ట్ చేశాను. అంతేకాదు కెరీర్ లో ఇంకా భిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను కానీ.. మన మేకర్స్ కు తెలుగు అమ్మాయిలు నచ్చడంలేదు. ప్రేక్షకుల నుండి డిమాండ్ లేకపోయినా... ఇతర భాషల నుండి హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎవర్ని కావాలని టార్గెట్ చేసి మాట్లాడటం లేదు అని చెప్పుకొచ్చింది"

ప్రస్తుతం ఈషా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈషా చేసిన ఈ కామెంట్స్ కు చాలా మంది నెటిజన్స్ మద్దతు పలుకుతుంటే.. మరి కొందరు విభేదిస్తున్నారు.