వెయ్యి కోట్లా.. తొక్కా.. ఆ సినిమాకు అంత సీన్ లేదంటూ హీరోయిన్ కామెంట్స్

వెయ్యి కోట్లా.. తొక్కా.. ఆ సినిమాకు అంత సీన్ లేదంటూ హీరోయిన్ కామెంట్స్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah rakh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పఠాన్(Pathaan). దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్(Siddarth anand) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరా రూ.1000 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. వరుస ఫ్లాప్స్ తో డీలా పడిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది పఠాన్ మూవీ. 

ఇక షారుక్ కూడా చాల రోజుల తరువాత పఠాన్ తో భారీ హిట్ అందుకున్నారు. దీంతో షారుక్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే పఠాన్ సినిమా కలెక్షన్స్(Pathaan collections) విషయంలో మొదటినుండి చాలా సందేహాలు వ్యక్తం అయ్యాయి. చాలా మంది ఇవి ఫేక్ కలెక్షన్స్(Pathaan fake collections) అని ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. ఇక తాజాగా అవే కామెంట్స్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. 

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్(Kajol) ను హోస్ట్.. మీరు షారుక్ ను ఒక ప్రశ్న అడగాలనుకుంటే ఎం అడుగుతారు అని ప్రశ్నించారు. దానికి కాజోల్.. పఠాన్ మూవీ రియల్ కలెక్షన్స్(Pathaan real collections) ఎంత అని అడుగుతానని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కాజోల్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ లో వివాదంగా మారాయి. 

కాజోల్ చేసిన ఈ కామెంట్స్ పై షారుక్ అభిమానులు మండిపడుతున్నారు. మా హీరోకి ఫేక్ కలెక్షన్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి. తక్షణమే కాజోల్ షారుక్ కి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై కాజోల్ ఎలా స్పందిస్తారో చూడాలి.