ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీన్స్ చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించాయి.. ఈ క్యారెక్టర్ నాకొక బెస్ట్ ఎక్స్‎పీరియన్స్: మమిత బైజు

ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీన్స్ చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించాయి.. ఈ క్యారెక్టర్ నాకొక బెస్ట్ ఎక్స్‎పీరియన్స్: మమిత  బైజు

‘ప్రేమలు’ చిత్రంతో యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన మమిత  బైజు.. ఇప్పుడు ‘డ్యూడ్’ అనే మరో లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీతో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రదీప్ రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా ఆమె నటించిన ఈ చిత్రాన్ని కీర్తిశ్వరన్ రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మమిత బైజు చెప్పిన విశేషాలు.

‘‘దర్శకుడు కీర్తిశ్వరన్ చెప్పిన కాన్సెప్ట్  ఆసక్తికరంగా అనిపించింది. ఈ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత  ఉంది. కురల్ అనే హానెస్ట్ అమ్మాయిగా కనిపిస్తా.  ఇప్పటివరకు అలాంటి పాత్ర చేయలేదు. చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉంటూనే సూటిగా మాట్లాడే క్యారెక్టర్. ఈ పాత్ర చేయడం నాకొక మంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇచ్చింది. ఇందులోని  కొన్ని ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించాయి. ఆ సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రాత్రంతా డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేదాన్ని. నేనెప్పుడూ  షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు బాగా ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వాలనుకుంటా. 

ప్రదీప్ రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నటించడం వెరీ గుడ్  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్. ఆయన మల్టీ ట్యాలెంటెడ్.  సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటారు.  శరత్ కుమార్ లాంటి సీనియర్ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా.  ఇందులో ఉండే ఎమోషన్స్,  ఫన్ చాలా యూనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి.  సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. మైత్రీ మూవీ మేకర్స్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్.  చాలా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీశారు.  తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది’’.