V6 News

ఇవాళ(ఏప్రిల్ 27) ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం

ఇవాళ(ఏప్రిల్ 27) ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జనసమితి (టీజేఎస్) చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపడం, ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది. ముందుగా ఆయన నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి గన్‌‌పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. 

గన్‌‌పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మండలికి చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు.