V6 News

స్వదేశీ టెక్నాలజీతో భారత్ అగ్రగామి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

స్వదేశీ టెక్నాలజీతో భారత్ అగ్రగామి :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
  • 133వ మన్​కీ బాత్​పై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:  ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్​లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రధాని మోదీ 133వ మన్‌‌ కీ బాత్ కార్యక్రమాన్ని చూశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ  ప్రధాని చెప్పిన  విశేషాలు కార్యకర్తల్లో కొత్త స్ఫూర్తిని నింపాయని కొనియాడారు. 

తమిళనాడులోని కల్పకం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ దశకు చేరుకోవడం దేశచరిత్రలో ఒక మైలురాయి అని రాంచందర్ రావు పేర్కొన్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఘనత సాధించడం మన శాస్త్రవేత్తల పట్టుదలకు నిదర్శనమన్నారు.  పవన శక్తి ఉత్పత్తిలో భారత్ ఇవ్వాల 56 గిగావాట్లకు పైగా విద్యుత్తును సాధించి, ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.