Nari Nari Naduma Murari: శర్వానంద్ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు.. నారీ నారీ నడుమ నవ్వులు గ్యారెంటీ!”

Nari Nari Naduma Murari: శర్వానంద్ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు.. నారీ నారీ నడుమ నవ్వులు గ్యారెంటీ!”

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రం  ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌గా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలవుతోంది. సోమవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ ‘ఇదొక మెమొరబుల్ జర్నీ. ఇందులో చేసిన  నిత్య క్యారెక్టర్ చాలా స్పెషల్.  షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేశాం. శర్వా గారితో నటించడం ఆనందంగా ఉంది. తప్పకుండా అందరిని ఎంటర్‌‌‌‌టైన్ చేస్తుంది’ అని చెప్పింది.

సంయుక్త మాట్లాడుతూ ‘ఇది ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. పండగకు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.  ట్రైలర్‌‌‌‌కు మంచి బజ్ వచ్చింది.  సినిమాకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాం. సంక్రాంతికి వస్తోన్న  సినిమాలన్నీ  బ్లాక్ బస్టర్ అవ్వాలి’ అని చెప్పింది.   దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ ‘సామజవరగమన తరహాలోనే ఈ సినిమా కూడా అందర్నీ అలరిస్తుంది. సపోర్ట్ చేసిన రైటర్స్‌‌ భాను, నందుకు థ్యాంక్స్. శర్వాను చాలా కొత్తగా చూస్తారు’ అని చెప్పాడు. 

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ‘మేం రూపొందించిన ‘సామజవరగమన’ ఒక మిరాకిల్. అది ఊహించినదానికంటే ఎక్కువ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కూడా అలాంటి బజ్ వస్తుంది. రామ్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. హీరోయిన్స్ సంయుక్త, సాక్షి బాగా పెర్ఫార్మ్ చేశారు. సంక్రాంతి సీజన్ గురించి నాకు బాగా తెలుసు.  ఎన్ని సినిమాలొచ్చినా అన్నీ బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి.  అలాంటి మ్యాజిక్ సంక్రాంతి సీజన్‌‌కు ఉంది. ఈ చిత్రంతో ఆడియెన్స్‌‌కు నవ్వులు గ్యారెంటీ’ అని చెప్పారు.