
బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌కపూర్(Sonam kapoor) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. చిన్నబుద్ది గలవారు ఎదుటివ్యక్తుల గురించి మాట్లాడతారు. కాస్త ఆలోచించేవారు పరిస్థితుల గురించి మాట్లాడతారు. గొప్ప మనసు గలవారు ఆలోచనల గురించి చర్చిస్తుంటారు అంటూ ఎలియనోర్ రూజ్‌వెల్ట్‌కు సంబంధించిన ఓ కోట్‌ను షేర్ చేసింది. దానికి.. ఇది చిన్న విషయమే అయినప్పటికీ కొంత మంది దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మరీ ముఖ్యంగా రూమర్స్ గురించి మాట్లాడేప్పుడు ఇది గుర్తుంచుకోవాలని అనుకుంటున్నా అనే క్యాప్షన్ ఇచ్చింది సోనమ్.
ఇది చూసిన నెటిజన్లు సోనమ్ ఈ పోస్ట్ ను టాలీవుడ్ హీరో రానా(Rana)కు కౌంటర్ గా వేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా వస్తున్న ‘కింగ్ ఆఫ్ కోధ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రానా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ ఈవెంట్ లో రానా మాట్లాడుతూ.. నేను ఒకసారి దుల్కర్ నటిస్తున్న సినిమా షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ ఓ బాలీవుడ్ హీరోయిన్ షూట్ మధ్యలో తన భర్తతో ఫోన్‌లో షాపింగ్ గురించి మాట్లాడుతోంది. ఆమె కోసం దుల్కర్ వెయిట్ చేస్తున్నా పట్టించుకోకుండా.. అలాగే మాట్లాడుతూ ఉంది. ఆతరువాత ఆమె సరిగ్గా యాక్ట్ చేయకపోతే.. మరోసారి ఆ సీన్స్‌లో యాక్ట్ చేయడానికి ముందుకు వచ్చారు దుల్కర్ అంటూ కామెంట్స్ చేశాడు రానా. ఈ కామెంట్స్ పై తరువాతి రోజు క్షమాపణలు కూడా చెప్పారు రానా.
దీంతో ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నారు అంత. అయితే తాజాగా రానా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సోనమ్. ఇక సోనమ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.