పుష్ప2 లో శ్రీలీల.. వైరలవుతున్న క్రేజీ అప్డేట్

పుష్ప2 లో శ్రీలీల.. వైరలవుతున్న క్రేజీ అప్డేట్

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందా? ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పుష్ప2(Pushpa2) షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. 2021లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా పుష్ప(Pushpa)కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పుష్ప పార్ట్ 2ను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు సుకుమార్(Sukumar).

అయితే తాజా సమాచారం ప్రకారం. ఈ పుష్ప2లో ఒక స్పెషల్ సాంగ్ చేసేందుకు శ్రీలీలను అప్రోచ్ అయ్యారట పుష్ప టీమ్. కానీ ఈ ఆఫర్ పై తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదట ఈ బ్యూటీ. ఆలోచించుకోవడానికి కాస్త సమయం అడిగిందని సమాచారం. ఒక వేళ శ్రీలీల గనుక ఈ సాంగ్ కు ఒకే చెప్తే.. పుష్ప2 లో ఈ పాట హైలెట్ అవడం ఖాయం. ఎందుకంటే.. అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక శ్రీలీల కూడా డాన్స్ లో ఇదరగదీసేస్తోంది. ఈ ఇద్దరు డాన్సర్స్ కలిసి ఒక పాటకి డాన్స్ చేస్తే ఆ కిక్కు నెక్స్ట్ లెవల్లో ఉండటం ఖాయం. అందుకే ఈ పాత కోసం శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నారట సుకుమార్ అండ్ టీమ్. మరి ఈ ఆఫర్ కు శ్రీలీల ఒకే చెప్తుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.