చెప్పు తెగుద్ది.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన వైష్ణవి

చెప్పు తెగుద్ది.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన వైష్ణవి

ఈ మధ్య ఏ మూవీ ప్రెస్ మీట్ అయినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు సురేష్ కొండేటి(Suresh kondeti). ప్రెస్ మీట్ లో చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ.. మూవీ యూనిట్ ను ఇబ్బంది పెట్టడం ఆయనకు అలవాటే. ఈ మధ్య జరిగిన దాదాపు అన్ని సినిమా ప్రెస్ మీట్స్ లో ఆయన పేరు ఖచ్చితంగా వినిపించింది. అప్పుడెప్పుడో వచ్చిన dj టిల్లు నుండి మొన్న వచ్చిన విరూపాక్ష వరకు.. అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు సురేష్ కొండేటి. 

దీంతో సురేష్ కొండేటిని నెటిజన్స్ ఫుల్లుగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా మరోసారి అలాంటి ప్రశ్నే అడిగి.. ట్రోల్ అవుతున్నారు ఆయన. తాజాగా ఆనంద్ దేవరకొండ(Anand devarakonda) హీరోగా బేబీ(Baby) అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సాయి రాజేష్(Sai Rejesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. ప్రముఖ యూటుబర్ వైష్ణవి చైతన్య(Vaishnavi chaithanya) హీరోయిన్ గా నటిస్తుండగా.. జులై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచిన మూవీ టీమ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో సురేష్ కొండేటి యాంకర్ గా వ్యవహరించారు. ఇందులో భాగంగా.. సురేష్ కొండేటి హీరోయిన్ వైష్ణవిని కాస్త ఇబ్బంది పెట్టె ప్రశ్న వేశారు. దానికి వైష్ణవి కూడా ఏమాత్రం తడబడకుండా.. చాచికొట్టినట్టు సమాధానం ఇచ్చింది. సురేష్ కొండేటి..  'వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా' అని హీరోయిన్ ను అడిగాడు. దానికి ఒక్కసారిగా షాకైంది వైష్ణవి. ఇంతలో సురేష్ మధ్యలో కలుగజేసుకొని.. ఇదే కదా సినిమాలో హీరో మిమ్మల్ని అడిగేది దానికి మీ రియాక్షన్ ఏంటి ? అని అడిగారు. 

దానికి సమాధానంగా వైష్ణవి.. "చెప్పు తెగుద్ది అంటాను" అని చెప్పింది. దీంతో సురేష్ కొండేటి మొహం ఒక్కసారిగా మారిపోయింది. మరి ఈ  డైలాగ్ వైష్ణవి కావాలనే అందా.. లేక సినిమా లో హీరోతో అనే డైలాగా అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా మరోసారి సురేష్ కొండేటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.