
జూబ్లీహిల్స్, వెలుగు: సినీ ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సమంత పేర్లతో నకిలీ ఓటర్ కార్డులను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సయ్యద్ యేయ్యా కమల్ మధురానగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా పేర్లతో ఓట్లు ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలక్షన్ అధికారులు స్పందించి వారికి జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు లేదని తేల్చారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కమల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.