హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చెయ్యాలి: దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చెయ్యాలి: దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైటెక్​సిటీ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్​మేనేజర్ సంజయ్​కుమార్​శ్రీవాస్తవ ​ మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి తనిఖీ చేశారు.ఈ స్టేషన్‌‌లో అందుబాటులో ఉన్న ప్రయాణీకుల సౌకర్యాలు, వసతులను సమీక్షించారు. 

బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, స్టేషన్‌‌లోని సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా హైటెక్ సిటీ స్టేషన్‌‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు.

 పునరాభివృద్ధి పనుల పురోగతిపై డివిజనల్ అధికారులు నివేదికను సమర్పించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడానికి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  జీఎం వెంట సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.