50 కంపెనీలకు.. హైబిజ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్

50 కంపెనీలకు.. హైబిజ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన హైబిజ్ టీవీ 3వ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 వేడుకలో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన 50కిపైగా సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. ఎన్ఎండీసీ, ఎన్టీపీసీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు వీటిని అందుకున్నాయి. 

వియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రతీకగా గుర్తింపు పొందింది. రియల్ ఎస్టేట్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్  కంపెనీ హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎస్ ఇండియా ప్రాపర్టీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కైవసం చేసుకుంది.  రైట్ లోన్స్, వెరిఫైడ్ హోమ్స్ కాన్సెప్ట్ ద్వారా ఇండ్ల కొనుగోలుదారులకు పారదర్శక సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. 

చట్టపరంగా ధ్రువీకరించిన లోన్ రెడీ ప్రాపర్టీలను అందుబాటులోకి తెస్తూ వినియోగదారుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని సంస్థ తెలిపింది.  సామాజిక బాధ్యతతో పనిచేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ వేడుక ఉద్దేశమని హైబిజ్​ తెలిపింది.