జవాద్ తుఫాన్ తో ఒడిశాలోని 14 తీర ప్రాంత జిల్లాలకు హై అలర్ట్
V6 Velugu Posted on Dec 03, 2021
జవాదు తుఫానుగా మారడంతో అధికారులు అలర్టయ్యారు.జవాద్ తుఫాన్ ఉత్తరాంధ్ర, ఒడిషాల మధ్య తుఫాను రేపు(శనివారం) తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశాలోని 14 తీర ప్రాంత జిల్లాలను అలర్ట్గా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన తుఫాను నెమ్మదిగా తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 32 కిలోమీటర్ల దూరంలో తీరం వైపు కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటించింది. శనివారం ఉదయం దక్షిణ ఒడిషా.. ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా రానుంది. దీంతో ఒడిశా, ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరూ.. సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చిరించారు.
Tagged Odisha, High alert, 14 coastal districts, Jawad cyclone effect