హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్ పై విచారణ.. రెండు వారాలకు వాయిదా

హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్ పై విచారణ.. రెండు వారాలకు వాయిదా

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ పై విచారణను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై దాఖలైన పిటీషన్ పై డిసెంబర్ 19వ తేదీ మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.  సీఎస్ నుంచి సమాచారం తీసుకుని రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.మేడిగడ్డ బ్యారేజీ ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కి పలు ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్ కు  నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి లేఖ రాసింది.