- న్యాయవాదిని నియమించుకోండి
- పిటిషనర్‌కు హైకోర్టు సూచన
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఒక్క కాంట్రాక్టర్‌కే 22కిపైగా కాంట్రాక్ట్‌లు అప్పగించడంలో అవినీతి జరిగిందంటూ దాఖలైన పిల్‌లో వాదనలు తెలుగులో వినిపించడం సరికాదని, న్యాయవాదిని నియమించుకోవాలంటూ పిటిషనర్‌కు హైకోర్టు బుధవారం సూచించింది. విచారణ ప్రక్రియ ఇంగ్లీషులో కొనసాగించాల్సి ఉన్నందున న్యాయవాదిని నియమించుకోవడానికి పిటిషన ర్‌కు 4 వారాల గడువు మంజూరు చేసింది.
ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు 22కు పైగా కాంట్రాక్ట్‌లు ఇచ్చిన పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ 2020లో ఖమ్మం జిల్లా సీతారాంపురానికి చెందిన తుమ్మలపల్లి రాంబాబు పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. వాదనలు ఇంగ్లీషులో చెప్పాలని సూచించింది.
